గ్రామాలలో గులాబీ రెపరెపలు
– ఊరూర జెండా ఆవిష్కరించిన నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలోని గ్రామాలలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. బుధవారం టీఆర్ఎస్ 21వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాండూరు మండలంలోని చెంగోల్, ఎల్మకన్న, గుంతబాస్పల్లి తదితర గ్రామాల్లో టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల పిలుపుతో గులాబీ జెండాలను ఎగురవేశారు. చెంగోల్ గ్రామంలో సర్పంచ్ మళ్లీశ్వరి గౌడ్, ఎల్మన్నె గ్రామంలో సర్పంచ్ ఆకుల నాగమణిల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో చెంగోల్ గ్రామ కమిటీ అధ్యక్షులు చాకలి వీరప్ప, ఉపసర్పంచ్ లక్ష్మప్ప, నాయకులు వేణుగౌడ్, సంతీష్ చందర్, కృష్ణయ్య, వెంకటయ్య, ఎల్మకన్నె టీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీశ్వర్, జగన్నాథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింలు, చంద్రప్ప, మోనప్ప, అబ్దుల్, బాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే. బంగారు తెలంగాణ సాధ్యపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమానికి, అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడ టీఆర్ఎ స్ అధికారం చేపడుతుందని అన్నారు.


