తెలంగాణ ఆడబిడ్డను అవమానిస్తారా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తెలంగాణ ఆడబిడ్డను అవమానిస్తారా..!
– కవితపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
– బండి సంజయ్ క్షమాపణ చెప్పి తీరాలి
– మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ఆడ బిడ్డను అవమానిస్తారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌పై తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ నోటీసులు, విచారణ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను శనివారం దీపా నర్సింలు ఓ ప్రకటనలో ఖండించారు. తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవిత గారి పై అనుచిత వ్యాఖ్యలు చెయ్యడం సరికాదని.. సహించలేనిదని అక్రోశం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంది ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచి వ్యవహారం కాదని, అడబిడ్డలను అవమనపరుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బండి సంజయ్ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. మహిళ కమీషన్, పోలీసులు బండి సంజయ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.