విద్యార్థుల మనసు దోచిన మార్వాడి యువమంచ్

కెరీర్ తాండూరు వికారాబాద్

విద్యార్థుల మనసు దోచిన మార్వాడి యువమంచ్
– పెద్దేముల్ కేజీబీవీలో ఆనంద్ సబ్ కే లియే వేడుకలు
– పాఠశాలకు హైమస్ట్ లైట్ల వితరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్వాడీ యువమంచ్ సభ్యులు పెద్దేముల్ కేజీబీవీ విద్యార్థుల మనసును దోచుకున్నారు. ప్రతి యేడాది దీపావళి సందర్భంగా తాండూరు శాఖ మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఆనంద్ సబ్ కే లియే వేడుకలు నిర్వహించడం ఆనవాయితి. ఈ యేడాది కూడ దీపావళి పండుగను పురస్కరించుకుని పెద్దేముల్ మండల కేజీబీవీ పాఠశాలలో ఆనంద్ సబ్ కే లియే వేడుకలను సంబరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మార్వాడి యువమంచ్ సభ్యులు 270 మంది విద్యార్థులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. పెద్దఎత్తున టపాసులు, చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు, సుర్ సుర్ బత్తీలు కాలుస్తూ విద్యార్థులు సంతోషంగా గడిపారు. అంతకుముందు పాఠశాలకు రెండు హైమస్ట్ లైట్లను విరాళంగా అందజేశారు. అదేవిధంగా విద్యార్థినిలకు క్రికెట్ కిట్ ఇప్పిస్తామని, విహార యాత్రకు తీసుకెళ్లే ఆలోచన చేస్తామని విద్యార్థుల అన్నారు. ఈ సందర్భంగా మార్వాడి యువమంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్‌ సార్డా మాట్లాడుతూ ప్రతియేడాది దీపావళీకి ముందు మార్వాడి యువమంచ్ జాతీయ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ సబ్‌ కే లియే పేరుతో దీపావళీ సంబరాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులతో పండగ జరుపుకోవడం గొప్ప అనుభూతినిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పరమేశ్వరి, పీఆర్టీయూ కార్యదర్శి నవీన్, మార్వాడి మంచ్ తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ గోపాల్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, పవన్ సోని, మహేష్ సార్థా, దీనేష్ పని, విద్యార్థులు పాల్గొన్నారు.