మనిషికి వృక్ష వ్యాధి
– ప్రపంచంలోనే తొలి కేసు
– భారత్‌లో వెలుగు చూసిన ఘటన
దర్శిని డెస్క్: ప్రపంచంలోనే తొలిసారి చెట్టుకు సోకే వ్యాధి మనిషికి సోకింది. ఈ అరుదైన ఘటన భారతదేశంలో వెలుగుచూసింది. ఇది జరిగిన కూడ రెండేళ్లు అవుతోందని ప్రముఖ మెడికల్ మైకాలజీ కేసు రిపోర్ట్స్ జర్నల్‌లో ఈ వ్యాధి నివేధిక ప్రచురితం అయ్యింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిని ఓ మైకాలజిస్ట్ వృక్షాల్లో ‘సిల్వర్ లీఫ్(Silver Leaf)’ వ్యాధికి కారణమయ్యే ‘కొండ్రోస్టీరియం పోర్పోరియమ్’ అనే శిలీంధ్రం పై పరిశోధనలు చేసేవారు. కుళ్లిపోతున్న పదార్థాలు, పుట్టగొడుగులు, వివిధ వృక్ష సంబంధిత శిలీంధ్రాలపై ఏళ్లుగా పరిశోధన సాగిస్తున్నారు. కుళ్లిపోతున్న పదార్థాలతో పని చేయడమే ఈ అరుదైన సంక్రమణకు కారణం కావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ స్వభావం, వ్యాప్తి చెందగల సామర్థ్యం మొదలైనవి నిర్ధారితం కాలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో చేసే ఓ పరిశోధకుడికి వృక్ష వ్యాధి సోకింది. ‘గొంతు బొంగురుపోవడం, దగ్గు, ఆయాసం, ఆహారం మింగడానికి ఇబ్బంది, ఆకలి మందగించడం వంటి లక్షణాలు బాధితుడి(61)లో కనిపించాయి. ఆయనకు మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, గాయాల వంటివి ఏం లేవు. అయితే బాధితుడికి చికిత్స అందజేసిన వైద్యులు ఈ కేసుకు సంబంధించి రూపొందించిన ఓ నివేదికలో ఇలా చెప్పుకొచ్చారు. బాధితుడి మెడ వద్ద కణితిని గుర్తించి.. శస్త్రచికిత్స ద్వారా తొలగించాం. అనంతరం తీసిన ‘ఎక్స్-రే’లో అసాధారణంగా ఏమీ కనిపించలేదు. ఆయన ‘యాంటీ- ఫంగల్’ ఔషధాలు తీసుకున్నారు. ఇది జరిగి రెండేళ్లవుతోంది. ఆయన ఇప్పుడు పూర్తిగా క్షేమంగా ఉన్నారు. ఆ వ్యాధి పునరావృతం అవుతుందనేందుకు కూడా ఆధారాల్లేవు. అయితే, సంప్రదాయ పరీక్ష విధానాలు(మైక్రోస్కోపీ, కల్చర్) బాధితుడిలో ఫంగస్ ఆనవాళ్లను గుర్తించలేకపోయాయి. ప్రస్తుతానికి సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ అసాధారణ వ్యాధి కారకాన్ని గుర్తించొచ్చు. వృక్షసంబంధిత శిలీంధ్రాల ద్వారా మనుషులకు వ్యాధి సోకే అవకాశాలు, వాటిని గుర్తించే విధానాల ఆవశ్యకతను ఈ కేసు చాటిచెబుతోంది’ అని వైద్యులు తమ నివేదికలో తెలిపారు.

