వ్యాధుల పట్ల పైలం..!
– ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
– మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్
– వైద్యాధికారులతో కలిసి అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్ వ్యాధుల పట్ల అందరు పైలంగా ఉండాలని తాండూరు మున్సిపల్ పరిధి 25వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ సూచించారు.

మంగళవారం ఆ వార్డులోని గరీబ్ నగర్, దేవీనగర్ కాలనీల్లో స్థానిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా.మాలాశ్రీ, సబ్ యూనిట్ ఆఫీసర్ ప్రకాష్లత కలిసి ప్రభాకర్ గౌడ్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే నిర్వహించారు. దోమల నివారణపై జాగ్రత్తలు సూచించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడకుండా దృష్టిసారించడం జరుగుతుందన్నారు.

ప్రజలందరు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యాధికారులు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ముఖ్యంగా దోమల వ్యాప్తి చెందకుండా చూసుకోవాలన్నారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు రేణుకా, పార్వతి, ఆశ వర్కర్లు మల్లేశ్వరి, రాములమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

