విద్యార్ధుల ఆరోగ్యానికి బీసీ సంఘం భరోసా
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల ఆరోగ్యానికి బీసీ సంఘం భరోసా అందిస్తోందని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు.

ప్రతి వారం బీసీ విద్యార్థులకు వైద్య శిబిరం నిర్వహిస్తామని చేసిన ప్రకటన మేరకు ఆదివారం బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో తాండూరు న్యూ లోటస్ హాస్పిటల్ సహాకారంతో తాండూర్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుకూరి రాజ్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి బీసీ సంఘం భరోసా అందిస్తోందని అన్నారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో విజయాలు సాధించగలరని అన్నారు. ఇంటర్ విద్య ప్రతి విద్యార్థి జీవితానికి టర్నింగ్ పాయింట్ అని పేర్కొంటూ, ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదువుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, బీసీ మహిళా సంఘం నాయకులు అనిత, మంజులా, నర్సమ్మ, జగదీశ్వరి, మంబాపూర్ మంజులా, గోట్కె విజయలక్ష్మి, బీసీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, బీసీ నాయకులు పర్మేష్, రాము ముదిరాజ్, రామ్‌రెడ్డి, దుబాయ్ వెంకటేష్, కిరణ్, వివేక్ పాల్గొన్నారు. అలాగే న్యూ లోటస్ హాస్పిటల్ ప్రతినిధి మాణిక్యం ఆధ్వర్యంలో డాక్టర్ జుబెర్ అహ్మద్, డాక్టర్ ఫిరోజ్ అహ్మద్, డాక్టర్ నౌరీన్ జహాన్, డాక్టర్ మహీదర్, డాక్టర్ సీమ, డాక్టర్ ముజమ్మిల్‌తో పాటు ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది పాల్గొని విద్యార్థినులకు వైద్య సేవలు అందించారు.


