దసరా వేడుకలో లొల్లి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

దసరా వేడుకలో లొల్లి..!
– మంత్రి మహేందర్ రెడ్డి ముందే రభస
– వాగ్వివాదానికి దిగిన నేతలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు
– అసలేం జరిగిందంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా వేడుకల్లో లొల్లి జరిగింది. నిధుల కేటాయింపు విషయంలో రాజకీయ నేతలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు వాగ్వివాదానికి దిగారు. మంత్రి మహేందర్ రెడ్డి పరస్పర వాదనలకు పాల్పడడంతో వేడుక రభసగా మారింది. ఈ సంఘటన తాండూరు మున్సిపల్ పరిధిలో సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..

ప్రతి యేడాది హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పాత తాండూరులోని బోనమ్మ దేవాలయం వద్ద విజయ దశమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సారి కూడా దేవాలయం వద్ద వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు హాజరయ్యారు. అయితే వేడుకలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ గతంలో హిందూ ఉత్సవ సమితికి మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు రూ. 25 లక్షల చొప్పున నిధుల మంజూరుకు హామి ఇచ్చారని గుర్తుచేస్తూ.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిధులను మంజూరు చేశారని అన్నారు.

దీనిపై హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మాజీ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్‌లు జోక్యం చేసుకుని సమితికి ఎవ్వరు నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఇదే మాట చెప్తున్నారని, దసరా వేడుకలను రాజకీయంగా వాడుకుంటున్నారని వాగ్వివాదానికి దిగారు. మంత్రి మహేందర్ రెడ్డి ముందే రాజుగౌడ్, పలువురు నేతలు, సమితి సభ్యులు వాగ్వివాదం చేసుకున్నారు. సరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడే ఉన్న పోలీసులు ఆందోళన కారులను తప్పించారు.

చివరకు గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ ఎమ్మెల్యే తరుపున ప్రకటించిన నిధులకు సంబంధించిన జీవో కాపీని చూపడంతో వివాదం చల్లారింది. అయితే దసరా వేడుకల్లో రాజకీయడం చేయడంపై పలువురు విమర్శించుకోవడడం చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత