నేడు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందు

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

నేడు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందు
– హాజరుకాన్న చేవేళ్ల ఎంపి రంజిత్ రెడ్డి
– తరలిరావాలని విజ్ఞప్తి చేసిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారు. నేడు మంగళవారం తాండూరు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ప్రతి ఏడాది రంజాన్ మాసం సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారని, ఈ సారి కూడా రంజాన్ పండగను పురస్కరించుకుని ఇఫ్తార్ విందు ఇవ్వబోతున్నారని తెలిపారు. నేడు తాండూరు టౌన్ లోని చెన్‌గెష్‌పూర్ రోడ్డు మార్గం లోని క్లాసిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సాయం త్రం 6 గంటలకు ఇఫ్తార్ విందు ఉంటుంద న్నారు.

ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొంటారని తెలిపారు. కావున ఈ ఇప్తార్ విందుకు తాండూరులోని ముస్లిం నేతలు, ప్రముఖులు, సోదరులు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.