భూకైలాస్‌లో భారీ భద్రత ఏర్పాట్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

భూకైలాస్‌లో భారీ భద్రత ఏర్పాట్లు..!
– మహారాష్ట్ర మంత్రి రాకకు హెలిప్యాడ్ స్థలం పరీశీలన
– వాసు నాయక్, శంకర్ నాయక్ లతో వివరాల ఆరా
– పరిశీలించిన తాండూరు డీఎస్పీ, తహసీల్దార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలోని భూకైలాస్ లో భారీ భద్రత ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూకైలాస్ లో కొనసాగుతున్న బ్రహ్మోత్సావాలు, జాతర ఉత్సవాలకు మహారాష్ట్ర నేల, నీటి సంరక్షణ మంత్రి సంజయ్ రాథోడ్ హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం తాండూరు డీఎస్పీ బాల కృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ భూకైలాస్ ను సందర్శించారు. దేవాలయ వ్యవస్థాపకులు వాసు నాయక్ పవార్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత శంకర్ నాయక పవార్ లతో కలిసి దెవాలయంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.

మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వస్తున్న సందర్భంగా హెలిప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చించారు. వారి సలహాలు, సూచనల మేరకు దేవాలయంకు సమీపంలో హెలీప్యాడ్ ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంపిక చేసి ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు దేవాలయంలో భక్తుల రద్దీ వల్ల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత చర్యలను కూడా చేపడుతున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ తారాసింగ్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.కునేందుకు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రానున్నారు దృష్టిలో పెట్టుకొని మంత్రి పర్యటనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్, మాజీ సర్పంచ్ రాంచెందర్, మాజీ ఎంపీటీసీ శాంతు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

శరవేగంగా అమృత్ భారత్ పనులు