నమో.. ఛాయా సోమలింగేశ్వరా..!

తాండూరు వికారాబాద్

నమో.. ఛాయా సోమలింగేశ్వరా..!
– ప్రత్యేక అలంకరణలో దర్శన మిచ్చిన శివుడు
– భద్రేశ్వర దేవాలయంలో ఆధ్యాత్మిక శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి: నమో ఛాయ సోమలింగేశ్వరా అంటూ భక్తులు శివున్ని దర్శించుకున్నారు. తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో వెలసిన శివుడు ఛాయ సోమలింగేశ్వరుడుగా దర్శనమిచ్చారు. సోమవారం సందర్భంగా ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి శివున్ని ఛాయ సోమలింగేశ్వరుడుగా ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన శివున్ని దర్శించుకుని పూజించారు. భక్తుల దర్శనాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.