పూల్‌సింగ్‌కు చీఫ్‌ విఫ్‌ నివాళి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పూల్‌సింగ్‌కు చీఫ్‌ విఫ్‌ నివాళి..!
– కుటుంబాన్ని పరామర్శించిన మహేందర్ రెడ్డి
– వెంట వచ్చిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దెముల్ మండలం పాషాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పూల్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విఫ్‌ పట్నం మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పూల్‌సింగ్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ విషయం తెలుసుకున్న చీఫ్‌ వీఫ్‌ మహేందర్ రెడ్డి పాషాపూర్ లోని వారి నివాసానికి వెళ్లారు. పూల్ సింగ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి… మనోదైర్యం చెప్పారు. అదేవిధంగా కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మరోవైపు ఓమ్లానాయక్‌ తాండాలో మృతి చెందిన చెన్యా నాయక్‌ కుటుంబాన్ని కూడా మహేందర్ రెడ్డి పరామర్శించారు. చీఫ్‌ విఫ్‌ వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ పి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డివై నర్సిములు, మారేపల్లి మాజీ సర్పంచ్ బల్వంత్ రెడ్డి, నారాయణ్ గౌడ్, మంబాపూర్ మాజీ ఎంపీటీసీ యాలేటి శ్రీనివాస్, బోయిని శ్రీనివాస్, యువ నాయకులు బిర్కెట్ రఘు, సిద్ధూ అయ్యా, అగ్గనుర్ సంకేత్, కాంతు, గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

మాజీ సర్పంచుల అరెస్టు..!