పేద విద్యార్థులకు తోడ్పాటు
– మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతా సంపత్
– గిరిజన తాండాల విద్యార్థులకు ష్యూస్, సాక్స్ పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద విద్యార్థులకు తమ వంతు తోడ్పాటు అందించడం జరుగుతుందని టీపీసీసీ బీసీ రాష్ట్ర కన్వీనర్, తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీతాసంపత్ అన్నారు. బుధవారం పెద్దేముల్ మండలంలోని పలు గిరిజన తాండాలలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ష్యూస్(బూట్లు), సాక్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాలలో మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు సామాజిక సేవ చేసేందుకు బీవీజీ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఫౌండేషన్ తరుపున పేద విద్యార్థులకు తోడ్పాటు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

అదేవిధంగా విద్యార్థులు చక్కగా చదుకోవాలని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాదించి పాఠశాలకు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, సీనీయర్ నాయకులు వడ్డె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శివరాం, మార్కెట్ కమిటి డైరెక్టర్ రాంశెట్టి, కాంగ్రెస్ యువ నాయకులు శ్రీకంత్ రెడ్డి, ఆయా తాండాల నాయకులు, పాఠశాలల ఉపాధ్యాయులు తదిదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

