రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు గాయాలు
– నడుచుకుంటు వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టిన బైకు
– వ్యక్తిని, హోంగార్డులను ఆసుపత్రికి తరలింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: రోడ్డు ప్రమాదంలో హోంగార్డుకు, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. పెద్దముల్ చెందిన కృష్ణ హైదరాబాద్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. సోమవారం విధులు ముగించుకొని రాత్రి 7 గంటల ప్రాంతంలో పెద్దముల్‌కు వెళుతున్నాడు. మార్గ మద్యంలోని కందనెల్లి తాండ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ప్రమాదవశాత్తు కృష్ణ బైకుతో ఢీ కొట్టారు.

ఈ ప్రమాదంలో నడుచుకుంటు వెళుతున్న వ్యక్తితో పాటు హోంగార్డ్ కృష్ణకు కూడా గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించగా హోంగార్డు కృష్ణను చికిత్స నిమిత్తం 108లో తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

