కేంద్ర పథకాలపై తెలంగాణ సర్కారు కుట్ర

తాండూరు రాజకీయం వికారాబాద్

కేంద్ర పథకాలపై తెలంగాణ సర్కారు కుట్ర
– ఎన్నికల హామిని నెరవేర్చని టీఆర్ఎస్
– రానున్న రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
– బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశమై మాట్లాడారు. పేదల ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం మంజూరు చేసే నిధులతో పాటు ఆరోగ్యం కోసం ఆయూష్మాన్ భవ హెల్త్ కార్డులను అమల చేయ‌డంలో, ఫించన్ పథకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వాల పథకాల పట్ల టీఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. రేషన్ కార్డులపై మోడి ఫోటో ముద్రించాల్సి వస్తుందని, బీజేపీకి ఆదరణ ఎరుగుతుందనే కుట్రతో కార్డులను మంజూరు చేయడం లేదన్నారు. జిల్లాలో ఉచిత డయాలసిస్, జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం వివక్ష చూపిందన్నారు. ఈ విషయాలపై ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పర్చేందుకు కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడి కృషి చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ రాబోయే రోజుల్లో బీజె అధికారంలోకి తీసుకువచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటికి నెరవేర్చ‌క పోవ‌డం చూస్తుంటే ప్రజలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్నికల వేళ ప్రవేశ పెట్టిన దళితబంధును కేవలం మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే అమలు చే చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు అందిస్తామన్నా నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు చెల్లించలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగావకాశాల పేరుతో పాచిక వేశారని అన్నారు. మరోసారి నిరుద్యోగులకు, ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ తాండూరు అభివృద్ధి పర్చడంలో పూర్తిగా విఫలయ్యాదని విమర్శించారు. కాలుష్యం, రోడ్లు, బ్రిడ్జిలు, ప్రాజెక్టులను పట్టించుకోవడంలేదన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఆధాయాన్ని అందిస్తున్న తాండూరును చిట్ట చివర నిలబెట్టిన ఘనత వారికి చెందుతుందన్నారు. మున్సిపల్లో కూడ రెండు వరాల పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టారని అన్నారు. కార్మికుల విషయంలో బాధ్యతరహితంగా వ్యవహించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అభివృద్ధి చె పట్టాలన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ పాలనలో అభివృద్ధి చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ బంటారం లావణ్య, పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, సీనియర్ నాయకులు పూజారి పాండు, చంద్ర శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి దోమ కృష్ణ, యాలాల ఇంచార్జ్ రజనీ కాంత్, తాండూరు మండల అధ్యక్షులు అంజనేయులు, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, బీజేవైఎం జిల్లా నాయకులు అంతారం కిరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.