వెరీ క్విక్‌ ట్రీట్‌ మెంట్..!

ఆరోగ్యం క్రైం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ హైదరాబాద్

వెరీ క్విక్‌ ట్రీట్‌ మెంట్..!
– ఫెవిక్విక్‌తో గాయానికి కుట్లు
– వింత వైద్యం చేసిన వైద్యులు
– చర్చనీయాంశమైన ఘటన
దర్శిని డెస్క్‌: చికిత్స చేసే సమయం లేదనో.. ఓపిక లేదనో కారణమేమో గాని.. ఓ వైద్య సిబ్బంది క్విక్‌ ట్రీట్ మెంట్ ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకున్నారంటే.. షాక్‌ అయి పోతారు. కొన్ని సంఘటనల్లో వైద్యులు చేసే ఆపరేషన్లలో వింతగా జరుగుతుంటాయి. కత్తెర మరిచి కుట్లు వేయడమో.. ఆపరేషన్ వస్తువులు మరిచి నిర్లక్ష్యంగా ట్రీట్ మెంట్ చేయడమో జరిగి వైరల్‌గా మారుతుంటాయి. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటనలో వైద్య సిబ్బంది ఫెవిక్విక్‌తో కుట్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ సంఘటన గురించి తెలుసుకుందాం పదండి.. ఈ షాకింగ్ ఘటన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో చోటుచేసుకుంది. బాధిత బాలుడి తండ్రి వంశీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు.. బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం అయిజకు వచ్చారు. ఈ క్రమంలో కుమారుడు ప్రవీణ్‌ చౌదరి (7) గురువారం రాత్రి పెళ్లి వేడుకలో ఆడుకుంటూ కిందపడ్డాడు. ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, లోతుగా గాయం అయినప్పటికీ.. వైద్య సిబ్బంది కుట్లు వేయకుండా అక్కడున్న ఫెవిక్విక్‌తో అతికించేసి పంపించారు. గమనించిన తండ్రి వంశీకృష్ణ ఆసుపత్రి వైద్యుడు నాగార్జునను ప్రశ్నించగా.. సిబ్బంది పొరపాటుగా చేశారని పేర్కొన్నారని వంశీకృష్ణ తెలిపారు. బాలుడికి ఏమీ కాదని, ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని చెప్పారన్నారు.

ఇది కూడా చదవండి..

పట్నం వారి పెళ్లి సందడి..!
– వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం
– కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ
https://dharshininews.com/16923