మెప్మా డీఎంసీపై చర్యలు తీసుకోండి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మెప్మా డీఎంసీపై చర్యలు తీసుకోండి
– జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్‌లకు ఫిర్యాదు
– తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనార్టి కార్పోరేషన్ రుణాల మంజూరులో లబ్ధిదారులను తప్పుదోవ పట్టించిన మెప్మా డీఎంసీ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ కోరారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తాండూరు మున్సిపల్ కమీషనర్ శంకర్ సింగ్ లకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత మార్చి 25వ తేదిన మెప్మా డీఎంసీ/టీఎంసీ రవికుమార్ మైనార్టీ కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు రూ. 1 లక్ష్మ నుంచి 2 లక్షల వరకు రుణాలు మంజూరు అయ్యాయని ఓ సమావేశంలో తెలిపారని గుర్తుచేశారు. అట్టి రుణాల కోసం లబ్దిదారులు రూ. 1లక్ష రుణాల కోసం రూ. 20 వేలు, రూ. 2 లక్షల రుణాల కోసం రూ.60 వేలు డీడీలు చెల్లించాలని సూచించారని ఆరోపించారు. ఇందుకు లబ్దిదారులు అప్పులు తెచ్చి డీడీలు కట్టారని, రెండు నెలలు దాటినా రుణాలు మంజూరు కాలేకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ అవస్థలు పడుతున్నారని అన్నారు. డీడీలు కట్టాలని లబ్దిదారులను తప్పుదోవ పట్టించిన డీఎంసీ రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ లను కోరారు. మైనార్టీ లబ్దిదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…

అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!
– స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
– శక్తిపీఠాల పూజల కోసం అని పుకార్లు
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన

అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!