మార్మోగిన అయ్యప్ప నామ స్మరణ
– తాండూరులో భక్తి శ్రద్ధలతో అఖండ భజన
– పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం అయ్యప్ప నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ నామస్మరణ మార్మోగింది. ఆదివారం దేవాలయంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో 12 గంటల అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అఖండ భజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. స్వాములు, భక్తులు అయ్యప్ప నామస్మరణను మార్మోగించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. అంతనం అఖండ భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, నాయకులు జీ. రవిందర్, ఇందూరు ప్రకాష్, మారేపల్లి సర్పంచ్ బల్వంత్ రెడ్డి, బిర్కడ్ రఘు, అశోక్, కోట్ట రాజ్ కుమార్ రెడ్డి, సిద్దు, విజయ్ కుమార్ గౌడ్, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు కేశవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

