సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు అండ

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు అండ
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– లబ్దిదారులకు రూ. 10.32 లక్షల ఎల్‌ఓసీల పంపిణి
తాండూరు, దర్శిని ప్రతినిధి : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేదలకు వరమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గంలోని లబ్దిదారులు 20 మందికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు రూ.10 లక్షల 32వేలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎంతో మంది పేదలు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పథకంతో కార్పొరేట్‌ వైద్యం చేసుకుంటున్నారని అన్నారు. గతంలో సీఎంఆర్‌ఎఫ్‌ మంజూరు కావాలంటే సంవత్సరాలు పట్టేదని, ఇప్పుడు రెండు, మూడు నెలల్లోనే మంజూరవుతుందన్నారు. లబ్దిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.