మా జీతాలు ఇవ్వండి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

మా జీతాలు ఇవ్వండి..!
– ఐదేండ్లుగా అందని వేతనం
– పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నం
– తాండూరు మున్సిపల్లో కలకలం
తాండూరు, దర్శిని ప్రతినిధి : మా జీతం మాకు ఇవ్వండి అంటూ తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. పెట్రోల్ తెచ్చిన డబ్బాతో ఆత్మహత్యాయత్నంకు యత్నించారు. ఈ సంఘటన సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరుకు చెందిన నర్సింలు, జ్యోతిలు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కింద పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్మికుల వేతనాల కోసం కార్యాలయంలో గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు. 9మంది ఉన్న గ్రూపులో నర్సింలు, జ్యోతిలు కూడా ఉన్నారు. గ్రూపులో 7 మందికి వేతనాలు రాగా వీరిద్దరికి వేతనాలు అందడం లేదు.

దీంతో వారు మున్సిపల్ కార్యాలయంలో నిరసనకు దిగారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతామని హెచ్చరించారు. మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహా రెడ్డి కార్మికులతో మాట్లాడేందుకు యత్నించగా వాగ్వివాదం జరిగింది. మాతో ఉన్న వారికి వేతనాలు వస్తున్నాయి.. మాకెందుకు రావడం లేదని ప్రశ్నించారు. గ్రూపులో ఉన్న 7 మంది పేర్లు నమోదు కాగా, మీ ఇద్దరు పేర్లు ఎవ్వరు నమోదు చేయలేదని చెప్పినా వి నిపించుకోలేదు.

విషయం తెలుసుకున్న తాండూరు పోలీసు సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. వారి వద్ద నుంచి పెట్రోల్ డబ్బాను తీసుకున్నారు. ఈ విషయంపై కమీషనర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో, జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు అందిస్తే అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులు శాంతించడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదికూడా చదవండి..

రాటుదేలిన రియల్ వ్యాపారులు..!