ముక్కు, నాలుక కోసి వ్యక్తి హత్య

క్రైం తాండూరు వికారాబాద్

ముక్కు, నాలుక కోసి వ్యక్తి హత్య
– చెవులను కూడా కోసిన దుండగులు
– వికారాబాద్‌ జిల్లాలో దారుణ ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: మనిషి ముక్కు, నాలుక, చెవులను కోసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కోడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్‌లో కలకలం రేపింది. హత్యకు గురైన వ్యక్తిని గ్రామానికి చెందిన సంగెపల్లి శేఖర్(32)గా గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు అతని చెవులు, ముక్కు, నాలుక కోసి చంపేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage