ట్రస్టు భూమిలో ట్విస్ట్..!
– విద్యా వికాస్ సమితికే హక్కులు
– తీర్పు ఇచ్చినట్లు చైర్మన్ శశిప్రభ వెల్లడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వివాదాస్పదమైన విద్యా వికాస్ సమితి ట్రస్ట్ భూమి హక్కుల విషయంలో ట్విస్ట్ వచ్చింది. ఈ భూమి హక్కులు ట్రస్టుకే చెందుతాయని కోర్టు తీర్పు వెలువరించినట్లు ట్రస్ట్ చైర్మన్ శశిప్రభ మాణిక్ రావు తెలిపారు. బుధవారం ఆమె ఓ విడియోలో మాట్లాడారు. పట్టణంలోని పీపుల్స్ డిగ్రీ కళాశాల సమీపంలోని విద్యా వికాస సమితి ట్రస్ట్ సంబంధించిన 33 ఎకరాల భూమి విషయంలో కొన్నేండ్లుగా వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. సుమారు రూ. 200 కోట్ల విలువైన కొన్ని నెలల క్రితం కొందరు హైదరాబాద్ కు చెందిన రియల్టర్లు, తాండూరుకు చెందిన కొందరు రాజకీయ నాయకులు కలిసి భూమిలో పాగా వేశారు. గుండాలతో రౌడీలతో కలిసి రాజకీయ నాయకులు కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
హద్దులు ఏర్పాటు చేసుకుని ప్రహరీ గోడలు నిర్మించి ఫ్లాట్లు కూడా చేశారు. ఈ విషయంలో ట్రస్టు చైర్మన్ శశిప్రభ, సభ్యులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై వాదోపవాదనాలు విన్న న్యాయస్థానం జూన్ 5వ తేదీన భూమి యొక్క సర్వహక్కులు విద్య వికాస సమితి ట్రస్టుకే అని తీర్పు ఇచ్చిందని చైర్మన్ శశిప్రభ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, భెదిరించినా చివరకు న్యాయం గెలిచిందని అన్నారు. విద్యా వికాస సమితి ట్రస్టుకే ఈ భూమి హక్కులు ఉంటాయని అన్నారు. త్వరలోనే భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ పోరాటంలో మద్దతు ఇచ్చిన వారందిరికి ధన్యవాదాలు.
వీడియో కింద ఉంది


