న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ప్ర‌త్యేక నిఘా..!

తాండూరు వికారాబాద్

న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ప్ర‌త్యేక నిఘా..!
– పార్టీలు, రిసార్ట్, ఫాంహౌస్‌ల‌పై ఆంక్ష‌లు
– జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు ర్యాలీలు, స‌భ‌ల‌పై నిషేధం
– ప‌క‌డ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు
– నిబంధ‌న‌లు పాటించ‌కుంటే కేసులు న‌మోదు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: జిల్లాలో డిసెంబ‌ర్ 31, న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ప్ర‌త్యేక నిఘా ఉంచ‌డం జ‌రిగింద‌ని, నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి హెచ్చ‌రించారు. గురువారం జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ కేసులు న‌మోదు నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 31, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌డం జ‌రిగింద‌ని గుర్తుచేశారు. ఈ వేడుక‌ల ప‌ట్ల‌ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాల‌న్నారు. డి‌జే, సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు ఎలాంటి అనుమతులు లేవని స్ప‌ష్టం చేశారు. అదేవిధంగా రిసార్ట్, ఫామ్ హౌస్‌ల‌పై ప్రత్యేకమైన నిఘా వుంటుందని పేర్కొన్నారు. రిసార్ట్‌ల‌తో పాటు ఫార్మ్ హౌస్ లలో ఎలాంటి ఆశీల్లత కార్యక్రమాలు జరపకూడ‌ద‌న్నారు. 31 డిసెంబర్ అర్దరాత్రి సమయంలో నూతన సంవత్సరం వచ్చిన సంధార్బంగా బైక్ ర్యాలీలు నిర్వ‌హించేందుకు ఎలాంటి అనుమతి లేదని గుర్తుచేశారు. జిల్లా పరిధిలో 31న‌ రాత్రి సమయం లో 40 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మద్యం త్రాగి, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, చేసిన వాహనలు, నియామ నిబందలను పాటించకుండా వాహనాలు నడిపిన వారిపై చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా జ‌నవరి 2 వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీల పై నిషేధం ఉంటుంద‌న్నారు. ఒమిక్రాన్ వేరియంట్ నియంత్రణలో భాగంగా ప్రజలు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వం విధించిన ఆంక్షలు , పోలీసుల సలహాలు సూచనలు పాటించి ఇండ్ల‌లోనే కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో ఆనందోత్సవాల మధ్య వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.