మహేంద్రుడికి పట్టాభిషేకం..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

మహేంద్రుడికి పట్టాభిషేకం..!
– నేడు కేసీఆర్ కెబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం
– రాజభవన్‌లో మధ్యాహ్నం ముహుర్తం
– హెల్త్‌ మినిస్టరీ ఖాయమంటున్న నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇక మంత్రి కాబోతున్నారు. కేసీఆర్ సర్కారు కెబినెట్‌లో ఆయన మంత్రి పదవి చేపట్టబోతున్నారు. నేడు మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారయ్యింది. నేడు మధ్యాహ్నం 3గంటలకు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార పార్టీ నేతలు వెల్లడించారు. అయితే మహేందర్ రెడ్డికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవిని ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈటల రాజేందర్‌ను తొలగించినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఇన్ని రోజులు ఆరోగ్య శాఖను హరీష్ రావు చూసుకుంటున్నారు. ఈ మంత్రి పదవిని ఇప్పుడు బర్తీ చేసేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలకు ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తుండగా.. మహేందర్‌రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే.. గతంలో మంత్రిగా పనిచేసినా మహేందర్ రెడ్డికి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.

రెండోసారి మంత్రిగా మహేందర్ రెడ్డి
తెలంగాణకు ముందు టీడీపీలో ఉన్న మహేందర్ రెడ్డి 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి కెబినెట్‌లో మహేందర్ రెడ్డి రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీగా పదవి పొంది, పదవి కాలం పూర్తయిన తరువాత కూడా రెండో సారి ఏకగ్రీవ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టిక్కెట్టును త్యాగం చేయడంతో కేసీఆర్ ఆయనకు మంత్రి పదవిని ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కెబినెట్‌లో రెండోసారి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!