వైభవంగా ఉర్సే షరీఫ్‌ ఉత్సవాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా ఉర్సే షరీఫ్‌ ఉత్సవాలు
– భక్తిశ్రద్దలతో గందం సమర్పణ
– సందళ్‌లో నేతల సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ముర్షద్‌ దర్గాలో హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీమ్ సాహెబ్ ఖిబ్లా చిప్తే ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 77వ ఉర్సే షరీఫ్, హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలీం పాష సాహెబ్ ఖిబ్లా చిష్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 17 ఉర్సే షరీఫ్ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నిర్వహకులు ముతవల్లి అల్హజ్ సయ్యద్ అబ్దుల్‌గని పాష ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు గంధము ఉత్సవాలను భక్తిశ్రద్దలతో నిర్వహించారు. వారి నివాసం నుంచి దర్గా వద్దకు ఊరేగింపు శోభాయామానంగా జరిగింది. సందళ్ వేడుకలో తాండూరు ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, తెలంగాణ బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు నేడు గురువారం దీపోత్సవం, రాత్రి ఖవ్వాలి, శుక్రవారం నమాజ్ బాద్ ఫజర్ తిలావత్ ఖురన్‌పాక్‌, రాత్రి 8గంటలకు పాతేహఖ్వాని వంటి కార్యక్రమాలు జరుగుతాయని నిర్వహకులు వెల్లడించారు. కావున ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని ఉర్సేషరీఫ్‌ను జయప్రదం చేయాలని మత పెద్దలు సయ్యద్ అబ్దుల్ గఫూర్ పాష, సయ్యద్ అబ్దుల్ ఖుర్షిద్ పాష, సయ్యద్ అబ్దుల్ అన్వర్ పాష, సయ్యద్ అబ్దుల్ జావిద్ పాష, వాలీపాషలు కోరారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!