గందరగోలంగా ఓటర్ల జాబితా
– వేర్వేరు బూతుల్లో ఒకే కుటుంబం ఓట్లు
– కర్ణాటక ఓటర్లను తొలగించాలి
– బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఓటర్ల జాబితా గందరగోలంగా ఉందని, వెంటనే ఓటర్ల జాబితాను సవరించాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని మున్సిపల్ వార్డుల్లో ఒక కుటుంబానికి చెందిన ఇద్దరి ఓట్లు ఒక బూతులో ఉంటే.. మరో ఇద్దరి ఓట్లు మరో బూతులో ఉన్నాయని, ఇలాంటి పరిణామాల వల్ల ఇబ్బందులు ఏర్పడుతాయయన్నారు. దీంతో పాటు తాండూరు ప్రాంతంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు దృష్టిసారించాలన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితాను సవరించాలన్నారు.
ఇది కూడా చదవండి…

