మాదక ద్రవ్యాలతో జీవితాలు చిద్రం

ఆరోగ్యం కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్


మాదక ద్రవ్యాలతో జీవితాలు చిద్రం
– అలవాటుకు యువత దూరంగా ఉండాలి
– బాలల సంక్షేమ సమితి అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవీతాలు చిద్రమై పోతాయని, ఈ అలవాటుకు యువతను దూరంగా ఉంచాల్సిన బాధ్యత అందరిదని పలువురు సూచించారు. గురువారం తాండూరు పట్టణం ఇందిరానగర్‌లోని ఆరోగ్య కేంద్రంలో బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమితి వికారాబాద్‌ చైర్ పర్సన్ వెంకటేష్‌, తాండూరు పట్టణ ఎస్ఐ కాశినాథ్‌, సీడీపీఓ శ్రీలక్ష్మీలు మాట్లాడారు.

మాదక ద్రవ్యాల వాడకం ఎంతో ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా 18 ఏండ్లు నిండిన యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. చెడు వ్యసనాలకు యువత బానిస కాకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా సత్ప్రవర్తనతో ఉండేలా చూడాలని, తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. యువత కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థాయి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం లీగల్ ఆఫీసర్, మెప్మా ఆఫీసర్ రాజేంద్రప్రసాద్, మహిళా సంఘాలు ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు ఆరోగ్య కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఇసు’కేటుగాళ్లు’..!