అట్టహాసంగా మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
– అర్దరాత్రే వేడుకలు జరిపిన అంతారం నాయకులు
– శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమాచారా, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం అర్దరాత్రి నుంచే హైదరాబాద్‌లోని మంత్రి మహేందర్ రెడ్డి నివాసంలో జన్మదిన వేడుకల సందడి ప్రారంభమయ్యింది. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు మ్యాతరి మోహన్ దాస్, పెండా బాబు, పెండా బాలు, పలువురు అభిమానులు మంత్రి మహేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అర్దరాత్రి మంత్రి మహేందర్ రెడ్డి చేత కేక్ కట్ చేయించారు. స్వీట్లు తినిపించి మంత్రి మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

