టెట్ రిజల్ట్ రిలీజ్..!
– ఫలితాలతో పాటు ఫైనల్ కీ కూడా
– ఫలితాల కోసం వెబ్సైట్లో క్లిక్ చేయండి
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) రిజల్ట్ రీలీజ్ అయ్యాయి. సంబంధిత శాఖ అధికారులు ఫలితాలను తుది ‘కీ’తో పాటు విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
https://tstet.cgg.gov.in/
(ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..)
టెట్ పరీక్ష పేపర్–1కు దాదాపు 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక పేపర్ 2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే.. వారిలో 1,89,963 మంది అంటే 91.11 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
టెట్ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబరు 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) జరగనుంది.
ఇది కూడా చదవండి…

