సాయిపూర్‌లో బోనం వైభోగం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయిపూర్‌లో బోనం వైభోగం..!
– ఘనంగా తాతగుడి బోనాల జాతర
– మొక్కు తీర్చుకున్న వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో బోనం వైభోగం సంతరించుకుంది. ఆషాడ మాసం సందర్భంగా మంగళవారం సాయిపూర్ 9వ వార్డులో వెలసిన తాత గుడి వద్ద బోనాల జాతర నిర్వహించారు. తాతగుడి వద్ద ఈశ్వరమ్మ, పోలేరమ్మకు బోనాల ఉత్సావాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయంలో వద్ద ఉన్న అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు.

జాతర ఉత్సవాలను ఉత్సవాలను పురస్కరించుకుని మున్సిపల్ వైస్ పట్లోళ్ల దీపా నర్సింలు బోనం ఎత్తుకున్నారు. అంతకుముందు ఇంట్లో బోనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భర్త పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ, కూతుళ్లతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చారు.

మరోవైపు సాయిపూర్‌కు చెందిన మహిళ భక్తులు కూడా అమ్మవార్లకు బోనాలను సమర్పించేందుకు ఊరేగింపుగా తరలివచ్చారు. ఊరేగింపు ముందు డప్పు వాయిద్యాలు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైస్‌ చైర్ పర్సన్‌తో పాటు మహిళలు, భక్తులు బోనాలతో ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరు నాపరాతి పరిశ్రమను ఆదుకోండి