సంక్షేమంలో మనమే నెంబర్ వన్
– బీజేపీ, కాంగ్రెస్ ల కన్నా ఎక్కువ చేస్తున్న సర్కారు
– వైద్యరంగం పురోభివృద్ధికి అధిక ప్రాధాన్యం
– కోట్ పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.40 కోట్లు
– మంత్రి, ఎమ్మెల్యే కలయికతో తాండూరు అభివృద్ధి
– తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
– హాట్రిక్ సర్కారుకు కృషి : గనుల మంత్రి మహేందర్ రెడ్డి
– కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– రూ.56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
– తాండూరులో ప్రగతి ప్రస్థాన సభ సక్సెస్
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ సర్కారు సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి, తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.56 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ లతో కలిసి ముఖ్య అతి థిగా హాజరై శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్లో జరిగిన ప్రగతి ప్రస్థాన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పెళ్లికి, కాన్పులకు సాయం అందిస్తున్నారని అన్నారు. తెలంగాణలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కాంగ్రెస్ హయాంలో నేను రాను బిడ్డ.. సర్కారు దవాఖానాకు అనే పరిస్థితి ఉంటే నేడు తెలంగాణలో పోదాం పదా సర్కారు దవఖానాకు అనే స్థాయికి ఎదిగిందన్నారు. అప్పట్లో ప్రవేటులో 70 శాతం ప్రసవాలు అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో 30 శాతం అయ్యేవని, ఇప్పుడు ప్రవేటులో 26 శాతం అయితే సర్కారు ఆసుపత్రిలో 76 శాతంకు చేరిందని వివరించారు. ఇందులో వికారాబాద్ జిల్లా తాండూరు 83 శాతంతో నిలవడం అభినందనీయమన్నారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఇంతకన్న తక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని విమర్శించారు. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల కలయికతో అభివృద్ధి దూసుకపోతుందన్నారు. త్వరలోనే కోట్ పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు రూ. 40 కోట్లు మంజూరు చేయిస్తామన్నారు. కాగ్నా బ్రిడ్జి ఫైల్ ను పరిష్కరిస్తామన్నారు. దీంతో పాటు జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, ఎంసీహెచ్ లో వసతుల ఆధునీకరణకు నిధులు మంజూరు చేయిస్తామన్నారు.

అంగన్వాడీలు ఆగం కావొద్దు
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్ వాడీలు ఆగం కావొద్దని మంత్రి హరీస్ రావు సూచించారు. ప్రగతి ప్రస్థాన సభలో అంగన్ వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆశలకు, అంగన్ వాడిలకు వేతనాలు అందిస్తున్నారని గుర్తుచేశారు. సీపీఐ, ప్రతిపక్షాలు చేసే ఒత్తిడితో సమ్మెకు దిగి అన్యాయం కావొద్దన్నారు. త్వరలోనే కొత్త పీఆర్సీని ప్రకటించి ఉద్యోగులతో పాటు అంగన్ వాడి, ఆకల వేతనాలను పెంచుకొ రామని వేధికపై స్పష్టం చేశారు.
హ్యాట్రిక్ సర్కారుకు కృషి: మంత్రి మహేందర్ రెడ్డి
అంతకుముందు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతోనే అన్ని జిల్లాలకు మహర్ధశ వచ్చిందన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త పంచాయతీల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం తెచ్చిందన్నారు. రెండో సారి అధికారంలో సీఎం కేసీఆర్ సర్కారు జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ మంజూరు చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధితో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. జిల్లాలోని పరిగి, కొ డంగల్, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాలను గెలిపించి హ్యాట్రిక్ సర్కారు ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు.

పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు : ఎంపీ రంజిత్ రెడ్డి
చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఏర్పాటుకు ముందు దగాపడిన తెలంగాణ బీఆర్ఎస్ సర్కారు వల్ల సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. అన్నిరంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక పోతుందన్నారు. జిల్లా ప్రజల సాగునీరు కోసం చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని ప్రధాని మోడిని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిత్తశుద్ది ఉన్న నాయకుడు కె సీఆర్ ఒక్కరే అని, మళ్లీ రాష్ట్రంలో హ్యాట్రిక్ సర్కారు ఖాయమన్నారు.
కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దు: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత యేడాది తాండూరు పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావును కోరిన వెంటనే తాండూరుకు సర్సింగ్ కాలే జీని మంజూరు చేయడం జరిగిందని గుర్తుచేస్తూ.. ఈ యేడాది శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు.

అదేవిధంగా మంత్రి తన్నీరు హరీష్ రావు సహాకారంతో తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ లో బస్తీదవాఖాన, కాగ్నాలో 6 కొత్త చెక్ డ్యాంలు, సబ్ స్టేషన్లు మంజూరు కావడం జరిగిందన్నారు. అదేవిధంగా తాండూరులో జీఐ గుర్తింపు పొందిన కందికి కంది బోర్డు, సబ్ కోర్టు మంజూరుకు దృష్టిసారించాలని కోరారు. దీంతో పాటు కోట్ పల్లి ప్రాజెక్టుకు నిధులు, ఎంసీహెచ్ ఆసుపత్రికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తాండూరులో 30 ఏండ్లు పాలన చేసిన మంత్రి మహేందర్ రెడ్డి టైగర్, మొనగాడు అంటూ అభివర్ణించారు. తాము ఇద్దరు కలవడంతో బీజేపీ, కాంగ్రెస్ పప్పులు ఉడకడం లేదన్నారు. తనను రూ.100 కోట్లకు కొనుగోలు చేయాలనుకున్న బీజేపీ కుట్రను బయట పెట్టి, ఆ దొంగల ఆట కట్టిడచం జరిగిందన్నారు. ఇక కాంగ్రెస్ లో అభ్యర్థిగా చెప్పుకుంటున్న వ్యక్తిని గతంలో తాండూరు నుంచి తరిమేస్తే చేవేళ్లకు వెళ్లారని, అక్కడి నుంచి తరిమేస్తే మేడ్చల్ కు వెళ్లారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను నమ్మొద్దని, భారీ మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిగా తనను ఆశీర్వదించాలని కోరారు.
56 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తాండూరు పర్యటనకు వచ్చిన మంత్రి హరీష్ రావు రూ.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో రూ. 25 కోట్లతో చె పట్టిన నర్సింల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, రూ.10 కోట్లతో చేపట్టిన కందనెల్లి, జినుగుర్తి, చంద్రవంచ, జుంటుపల్లిల విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకస్థాపన, రూ. 10 కోట్లతో చేపట్టే మార్కెట్ కమిటీ యార్డు నిర్మాణంకు శంకుస్థాపన, రూ.1.35 కోట్లతో పట్టణంలోని నూతన లైబ్రరీ భవనానికి శంకస్థాపనతో పాటు పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్టేషన్ ప్రారంభోత్సవం, ఎంసీహెచ్ లో షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్క చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, శ్రీశైల్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్మన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్మన్ వీణ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నాయకులు పట్లోల్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, సంగీత ఠాకూర్, మాజీ కౌన్సిలర్ పరిమళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్లు, డైరెక్టర్లు, వివిధ మండలాల అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

