హస్తంలో ఆ ఇద్దరి దూకుడు..!
– పార్టీ అసంతృప్తి నేతలో వరుస భేటీలు
– కాంగ్రెస్ సమీకరణాలను మార్చే ప్లాన్
– ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, డా.సంపత్ సార్లకు మద్దతు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు కాంగ్రెస్ పార్టీ అయోమయం పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల నోటిఫకేషన్ గడువు సమీపిస్తున్న కొద్దీ ఆ పార్టీ అభ్యర్థిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితిల్లోనే కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో అనూహ్య మార్పు జరిగింది.
అదే తాండూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ సీనీయర్ నేత డాక్టర్ సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టిలో చేరడం. ఈ ఇద్దరి చేరిక ఢిల్లీ కేంద్రంగా జరగడంతో అదికూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో జరగడంతో హాట్ టాపిక్‌గా మారింది.
దీంతో ముందే పార్టీ టిక్కెట్టు ఆశిస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, రఘువీరా రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌లకు పోటీగా ఈ ఇద్దరు పేర్లు చేరడంతో పార్టీలో టిక్కెట్ వార్ డిక్లేర్ అయ్యింది. అయితే పార్టీలో చేరిన ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్‌లు తమ స్టాటజీలను మొదలు పెట్టారు.
పార్టీ సీనీయర్ నేతలతో పాటు, అసంతృప్తిలో ఉన్న మాజీ మండలాల అధ్యక్షులను, మాజీ నేతలను కలిసి మద్దతు మంత్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఫలితంగా గతంలో ఉన్న పదువులు, సౌకర్యాలు ఇప్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవలే ఆర్బీఎల్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. తాజాగా తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావుతో కూడా భేటీ కావడంతో ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీ నుంచి ఇద్దరిలో శ్రీనివాస్ రెడ్డికి గాని, సంపత్ సార్ కు గాని టిక్కెట్టు ఎవ్వరికి వచ్చినా గెలుపుకు సహకరిస్తామని మద్దతు దారులతో చెబుతూ మద్దతను కూడగట్టుకుని దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
అయితే టిక్కెట్ ఎవ్వరికి వచ్చినా కేఎల్‌ఆర్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తుండడంతో ఆయన పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందనే విషయాలపై జోరుగా చర్చించుకుంటున్నారు. పార్టీలో టిక్కెట్టు దక్కెదెవరికో.. వేచి చూడాల్సిందే.
ఇదికూడా చదవండి…

