రూ. 2వేల నోట్లకు రెండో చాన్స్..!
– నోట్ల మార్పిడికి మరో గడువు
– మిగిలిన నోట్లను మార్చుకోవచ్చు
దర్శిని డెస్క్ : దేశంలో రూ. 2 వేల నోట్ల మార్పిడికి రెండో చాన్స్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్బీఐ నోట్ల మార్పిడిపై కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు మార్చుకునేందుకు విధించిన గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ ఏడాది మే 19న ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇచ్చిన గడువు నిన్నటితో ముగిసిన విషయం విదితమే.
అయితే ఆ గడువును ఆర్బీఐ అక్టోబర్ 7వ తేదీవరకు పొడిగించింది. ఇప్పటి వరకు నోట్లు మార్చుకోని వారు అక్టోబర్ 7వ తేదీ వరకు రూ.2వేల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది. అందువల్ల ఇంకా ఎవరైనా రూ.2 వేల నోట్లను మార్చుకోకుండా అలానే పెట్టుకొని ఉంటే.. వెంటనే త్వరపడి మార్చుకోవాలని తెలిపింది.
అదేవిధంగా గడువు తర్వాత అంటే, అక్టోబరు 8 నుంచి రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు ఆర్‌బీఐ కొన్ని ప్రత్యామ్నాయాలనూ సూచించింది. బ్యాంకుల ద్వారా డిపాజిట్, మార్పిడికి కుదరదు. కానీ, దేశ వ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాలను సంప్రదించి వ్యక్తులు ఒకేసారి రూ.20,000 వరకూ మార్చుకునే సౌకర్యం ఉంది.
ఇది కూడా చదవండి…

