వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు

జాతీయం తెలంగాణ హైదరాబాద్

వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు
– కుర్రాళ్ల వెరైటీ ఐడీయాకు అందరు ఫిదా
– సోషల్ మీడియాలో వైరల్
దర్శిని డెస్క్‌ : వినాయక చవితి వచ్చిందంటే చాలు వెరైటీ విగ్రహాలను ప్రతిష్టించడం.. మండపాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం చూస్తుంటాం. ఇందులో కొన్ని మనసుకు ఆహ్లాదాన్ని పంచితే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ సారి జరిగిన వినాయక ఉత్సవాల్లో ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కురుస్తున్న వర్షాల వల్ల వినాయకునికి ఎలాంటి ఆంటకాలు రాకూడదని ఏకంగా వినాయకున్ని వాటర్ ట్యాంకుపై ప్రతిష్టించారు. ఈ ఐడియాను కూడా నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఇరవై ఏళ్ల క్రితం రేవల్లి మండల కేంద్రంలోని వడ్లగేరిలో గణేశ్‌ మండపం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా భారీ వర్షాలకు వీధులన్నీ బురదమయంగా మారాయి. అప్పుడే అక్కడ కొత్తగా వాటర్‌ ట్యాంక్‌ను నిర్మించారు. కింద బురదగా ఉండడంతో యువకులు, కాలనీవాసులు గణపతిని ట్యాంక్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసి పూజించారు. నాటి నుంచి నేటి వరకు ఏటా అక్కడే బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.

అక్కడ ప్రతిష్ఠించడం వల్ల మంచి జరుగుతుందని, అందుకే ఏటా వినాయకుడి ప్రతిమను ఏర్పాటు చేసి పూజిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. చెక్కలతో సెట్రింగ్‌ ఏర్పాటు చేసి.. క్రేన్ సాయంతో వినాయకుడి ప్రతిమను అక్కడ కొలువుదీర్చినట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా మెట్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో వానొచ్చినా.. వరదొచ్చినా ఎలాంటి ఇబ్బందీ లేదు. వాటర్‌ ట్యాంక్‌పై కొలువుదీరిన ఈ వినాయకుడి ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇదికూడా చదవండి…

వ్యాధులకు చెక్‌ పెట్టే నల్ల ఎండు ద్రాక్ష..!