సామాజిక సేవలు ప్రశంసనీయం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక సేవలు ప్రశంసనీయం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వచ్ఛంద సంఘాలు చేసే సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం మహాత్మ గాంధీ గాంధీజయంతిని పురస్కరించుకుని తాండూరు లయన్స్ క్లబ్, మార్వాడి యువమంచ్. ఆర్యవైశ్య యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని బాలాజీ మందిర్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది.

ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి సందర్శించారు. మెగా వైద్య శిబిరంలో ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్, మార్వాడి. యువమంచ్, ఆర్యవైశ్య యువజన సంఘాలను అభినందించారు. ప్రతియేడాది రక్తదాన శిబిరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, మార్వాడి యువమంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సర్దా, లయన్స్ క్లబ్ అధ్యక్షులు భువనప్ప, సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్, ఆర్యవైశ్య యువజన సంఘం ప్రతినిధులు కోట్రిక శ్రీకాంత్, క్యాంపు చైర్మన్లు, దీపక్ గని, పవన్ సోని, దీనేష్ పర్తాని తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు