యాదవ సంఘం కార్యవర్గం ఎన్నిక
– తాండూరు అధ్యక్షులుగా రాజు యాదవ్
– సభ్యులుగా మరికొందరికి చోటు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు యాదవ సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. పట్టణంలోని నెహ్రు గంజ్ పరిధిలో శంకర్ లింగం అండ్ బ్రదర్స్ ఆ దుకాణంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా యాదవ సంఘం తాండూరు గౌరవాధ్యక్షులుగా నర్సింగ్ రావు యాదవ్, జీ.మల్లేశం, యాదవ్, అధ్య జీ. రాజు యాదవ్, ఉపాధ్యక్షులుగా బీ. శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శిగా ఎం. బస్వరాజ్ యాదవ్, సహాయ కార్యదర్శిగా జీ. అంజయ్య యాదవ్, కోశాధికారిగా జీ. లాలప్ప యాదవ్, సభ్యులుగా జీ.అనంతయ్య యాదవ్, ఎన్. రమేష్ యాదవ్, లక్ష్మీనారాయణ యాదవ్, గోపాల కృష్ణ యాదవ్, మల్లేష్ యాదవ్, నందు తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ యాదవుల సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…

