‘చేతి’లో చేరికల జోరు..!
– బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల వెల్లువ
– అంతారం, చెంగోల్ గ్రామాల నుంచి చేరిన నేతలు
– ఆహ్వానించిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలస వెల్లువ కనిపిస్తోంది. తాజాగా తాండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోని పలువురి చేరిక జరిగింది. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్ ల సమక్షంలో అంతారం, చెంగోల్ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేఆరు. మండలంలోని అంతారం గ్రామంలో మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ వడ్డె శ్రీనివాస్ తో పాటు నేతలు, మైనార్టీ నేతలు, కార్యకర్తలు చేరారు. చెంగోల్ గ్రామంలో ఎంపీటీసీ రత్నమాల రాము, నాయకులు రాము, అతని అనుచరులు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ 9 ఏండ్లుగా కేసీఆర్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేసిందన్నారు. దళితున్నే ముఖ్యమంత్రి చేస్తామని మోసం చేయడం ప్రారంభించందన్నారు. ప్రాజెక్టులు, పథకాలలో అంతా అవినీతి చేసిందని ఆరోపించారు. అవినీతి బీఆర్ఎస్ వైపు ఉంటే కాంగ్రెస్ సంక్షేమం వైపు నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే ఆరు గ్యారెంటీ, పథకాలను పక్కాగా అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం. కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, జి. రాందాస్, గోపాల్ రెడ్డి, మల్లప్ప, ఉదయ్ బాస్కర్ రెడ్డి, రాము ముదిరాజ్, యాదయ్య గౌడ్, యూత కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్, రాము, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

