గణేష్‌ భక్తులకు అలెర్ట్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గణేష్‌ భక్తులకు అలెర్ట్..!
– మండపాలకు పర్మిషన్ మస్ట్
– ఆన్‌లైన్ అనుమతులకు పోర్టల్‌
– ఉత్సవాల్లో డీజే సౌండే నిషేధం
– పోలీసుల పెట్టిన రూల్స్ ఇవే..
తాండూరు, దర్శిని ప్రతినిధి : వారం రోజుల్లో వచ్చే వినాయక చవితి సందర్భంగా తాండూరు పోలీసులు గణేష్‌ భక్తులు అలెర్ట్ అయ్యేలా ఫోకస్ పెట్టారు.
kvcs
వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. మండపాలను ఏర్పాటు చేసే వారు ఆన్ లైన్ లో అనుమతలు పొందాలని ప్రకటన చేశారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయడం జరిగిందని ప్రకటనలో తెలిపారు. ఇందులో మండపాల ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. అనుమతులు పొందేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వెబ్‌సైట్‌లోని రూల్స్ పాటించాలన్నారు.

అదేవిధంగా మండపాల వద్ద షాక్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పోలీసుల వివరాలను కలిగి ఉండాలన్నారు. వినాయక ఉత్సవాలలో డీజేలకు పర్మిషన్ లేదన్నారు. 24 గంటల పాటు మండపాల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసుకొ వాలన్నారు. దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైన్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులు తనిఖీకి వచ్చినప్పుడు సంతకాలు తీసుకోవాలన్నారు.

వినాయక చవితి నేపథ్యంలో సామాజిక మాద్యమాలలో వదంతులు, అసత్య ప్రచారాలు, పుకార్లు నమ్మరాదని సూచించారు. మండపాల వద్ద ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే డయల్ 100, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం సెల్: 8712670056కు సమాచారం అందించాలని సూచించారు. వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు పొందేందుకు ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి.. https://policeportal.tspolice.gov.in/index.htm

ఇదికూడా చదవండి…

సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టండి..!