అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం
– తల్లీ, బిడ్డా క్షేమం, ఆసుపత్రికి తరలింపు
– 108 సిబ్బంది మానవత్వానికి కృతజ్ఞతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడటమే కాదు.. పురిటి నొప్పులతో ఉన్న గర్భవతికి ప్రసవం చేసి తల్లీ బిడ్డలను కాపాడగలమని 108 సిబ్బంది నిరూపించారు. అంబులెన్స్‌లో ఓ మహిళకు కాన్పు చేసి.. పసికందును కాపాడి మానవత్వాన్ని చాటి చెప్పారు.

తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలం నవల్గా గ్రామానికి చెందిన మనీష(27) కు పురిటి నొప్పులు మొదలవడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేశారు. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన అంబులెన్స్‌లో ఆమెను గ్రామం నుంచి తీసుకవస్తున్నారు. తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలిస్తుండగా పట్టణంలోని విలియమూన్ చౌరస్తా వద్దకు రాగానే నొప్పులు అధికం కావడంతో పురుడు పోయాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఈఎంటీ ప్రకాష్‌, పైలెట్ నసీరుద్దీలు వైద్యుల సూచనలకు అనుగుణంగా ఆమె ప్రసవానికి తోడ్పాటు అందించారు. ప్రసవంలో తల్లీ, బిడ్డా క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వారిని మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. ఆపద సమయంలో మానవత్వం చూపిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

ఎస్‌కేటీఎస్‌లో యోగా డే అదుర్స్..!