అమెరికా టు తాండూరు..!
– 21 తులాల గోల్డ్ తో వచ్చిన యువతి
– స్వాధీనం చేసుకున్న పట్టణ పోలీసులు
– చివరికి ఏమన్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమెరికా నుంచి వికారాబాద్ జిల్లా తాండూరుకు వస్తున్న యువతి నుంచి పోలీసులు బంగారం(గోల్డ్)ను స్వాదీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన తనిఖీలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణానికి చెందిన ఓ యువతి అమెరికా లోని ఫ్లోరిడా నుంచి సొంత ప్రాంతానికి బయల్దేరింది. విమానాశ్రయం నుంచి శుక్రవారం తాండూరు పట్టణానికి వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా హైదరాబాద్ రోడ్డు మార్గం ఖాంజాపూర్ గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈక్రమంలో యువతి వద్ద 21 తులాల బంగారం ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారం కలిగి ఉండడం పట్ల పోలీసులు దానిని స్వాదీనం చేసుకున్నారు. బంగారాన్ని స్క్రీనింగ్ కమిటి సభ్యుని ముందు ప్రదర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో బంగారాన్ని స్వాదీనం చేసుకుంటున్నామని ఇందుకు సంబంధించి పత్రాలను చూపించి తిరిగి బంగారాన్ని సొంతం చేసుకోవచ్చని సీఐ రాజేందర్ రెడ్డి. కమిటి సభ్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి…

