బీసీలపై పైలెట్‌కు ప్రత్యేక శ్రద్ధ

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలపై పైలెట్‌కు ప్రత్యేక శ్రద్ధ
– ఎన్నికల్లో ఆయన్నే గెలిపించాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శనివారం యాలాల మండలం ఎన్కెపల్లి, పేర్కంపల్లి గ్రామాల్లో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తరుపున గ్రామ ప్రజలను కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బీసీల కోసం బీసీ సమీకృత భవనం నిర్మించారని అన్నారు.

బీసీల పట్ల రోహిత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, అభ్యున్నతినికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గెలుపుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, బీఆర్ఎస్ నాయకులు యాదయ్య, శ్రీనివాస్ గౌడ్, వెంకట్ కృష్ణ, రవీందర్ రెడ్డి, బీసీ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, హరి ప్రసాద్, రాము ముదిరాజ్, వెంకటేష్, నవీన్, బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..