జుంటుపల్లి జాతరలో విషాధం
– గుండంలో పడి మహిళ మృతి
– కేసు నమోదు చేసిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: యాలాల మండలం జుంటుపల్లి జాతరలో విషాధం నెలకొంది. జాతర కొలనులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. యాలాల పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన కర్రె భీమమ్మ(40) రేగడి మైలారంకు చెందిన తన చెల్లెల్లు సత్యమ్మతో కలిసి గురువారం రాత్రి జుంటుపల్లి జాతరకు వచ్చింది. రాత్రి దేవాలయ ఆవరణలో నిద్రించారు. శుక్రవారం స్వామి దర్శనం చేసుకునేందుకు సిద్దమై జాతర కొలను(గుండం)లో స్నానం చేసేందుకు భీమమ్మ చెల్లెలు సత్యమ్మతో కలిసి వెళ్లింది. అక్కడ ప్రమాద వశాత్తు భీమమ్మ గుండంలో కాలుజారి పడింది. చెల్లెలు సత్యమ్మ కేకలు వేయడంతో స్థానికులు గమనించి గాలించారు. చాల సేపటికి భీమమ్మను బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేశారు. ఆటోలో చికిత్స నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీశీలించిన వైద్యులు భీమమ్మ అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ తెలిపారు.

