రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయం
– బీసీ సంఘం జా.కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
– యాలాల మండలంలో జోరుగా ప్రచారం
– ప్రత్యేక ఆకర్షణగా గోల్డ్ మాన్ లాలాపేట్ లల్లు ముదిరాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో పైలెట్ రోహిత్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు అన్నారు. గురువారం బీసీ సంఘం, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యాలాల మండలంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. యాలాల ఎంపీపీ బాలేశ్వర గుప్తా, సిద్రాల శ్రీనివాస్, అక్బర్ బాబా నాయకులతో కలిసి కందుకూరి రాజ్ కుమార్ ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారానికి హాజరైన హైదరాబాద్ కు చెందిన గోల్డ్ మాన్ గా ప్రసిద్ధి చెందిన లాలాపేట్ లల్లూ ముదిరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాలాల్ మండల కేంద్రంలో ఇంత పెద్ద ఎత్తున యువకులు పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు రావడం, ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, అక్బర్ బాబల ఐక్యమత్యంతో రోహిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తుంటే రోహిత్ రెడ్డి విజయం బంపర్ మెజారిటీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అనంతయ్య, రమేష్, బసవరాజ్, ప్రవీణ్, లాలు, నర్సింలు, అశోక్, రవి యాదవ, నర్సింలు, శివయ్య, బాబయ్య, బాబుమియా, మౌలానాతో పాటు బీసీ సంఘం నాయకులు సయ్యద్ షుకూర్, గడ్డం వెంకటేష్, పాండు గౌడ్, నరేష్, రాము ముదిరాజ్, వంశీ, రఘు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

