రూల్స్ మీరితే కేసులే..!
– నెంబర్లు ప్లేట్లు, రిజిస్ట్రర్ లేకుంటే వాహనాల జప్తు
– తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్
– పట్టణంలో ముమ్మర తనిఖీలు, కేసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్ ఎరవైనా మీరితే కేసులు తప్పవని తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపిస్తున్న మైనర్లు, లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడిపిన వారు, త్రిపుల్ రైడింగ్ చేసిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ తాండూర్ పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, రిజిస్ట్రేషన్ చేయించని వాహనాలు, ఫాన్సీ నెంబర్ ప్లేట్ గల వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నట్లు గుర్తించామన్నారు.
మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ఈ విధారం నేరమని తెలిపారు. అదేవిధంగా నెంబర్లు ప్లేట్లు లేకుండా, లైసెన్స్‌లు లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం నేరమని తెలిపారు. ముఖ్యంగా మద్యం సేవించిన వాహనాలు నడపడం, 18 సంవత్సరాల కన్న తక్కువగా ఉన్న మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. రూల్స్ మితిమీరితే వాహనాలపై చలాన్లు విధించడంతో పాటు చట్టం ప్రకారం వాహనాలను జప్తు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. కావున వాహనదారులు అందరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

