సిట్టింగ్ ఎమ్మెల్యేకు సాత్ ఇద్దాం

తాండూరు రాజకీయం వికారాబాద్

సిట్టింగ్ ఎమ్మెల్యేకు సాత్ ఇద్దాం
– మరోసారి రోహిత్ రెడ్డిని గెలిపించుకుందాం
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మరోసారి సౌత్ ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్, రుక్మాపూర్, బుద్దారం, బండమీదిపల్లి, జనగాం తదితర గ్రామాల్లో బీఆర్ఎస్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తరుపున ప్రచారం నిర్వహించారు.

కందుకూరి రాజ్ కుమార్ సంఘం నేతలతో కలిసి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీసీల కోసం, బీసీ నాయకులకు, బీసీ కుల వృత్తి దారులకు తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. తాండూరు మరింత అభివృద్ధి చెందాలంటే సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అందరు సాత్ అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్. మంబాపూర్ సర్పంచ్ శ్రావణ్, సంఘం సభ్యులు బుద్దారం శ్రీనివాస్, తలారీ శ్రీనివాస్, రాము ముదిరాజ్, కృష్ణ, వెంకటేష్, ప్రసాద్, బీసీ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!