వైద్య సేవలపై మరింత నమ్మకాన్ని పెంచండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంచేవిధంగా దృష్టిసారించాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్‌గా నియామకమైన డాక్టర్ శెట్టి రవిశంకర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన చికిత్స అందించి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రసూతి రేట్ మరింత పెంచి ప్రజలకు ఆస్పత్రిపై నమ్మకం పెంచాలని ఎమ్మెల్యే సూచించారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహకారంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, ఇందర్‌చెడ్ నర్సింహారెడ్డి(రాజు), ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శరత్ చంద్ర తదితరులు ఉన్నారు.
