ఉల్లి ఎగుమతులపై నిషేధం

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఉల్లి ఎగుమతులపై నిషేధం
– కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
– ఎందుకోసమో నోటిఫికేషన్‌లో స్పష్టం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్టీ) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడైన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడును ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!