క్రిస్మస్ కానుకల పంపిణీకి వేళాయే..!
– నియోజకవర్గంలో వెయ్యి మందికి గిప్టులు
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతల మీదుగా పంపిణీ
– ప్రకటించిన ఆర్డీఓ శ్రీనివాస్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు గిఫ్టులు పంపిణీకి సర్వం సిద్దమయ్యింది. క్రిస్మస్ పండగ సందర్బంగా ప్రభుత్వం తాండూరు నియోజకవర్గ క్రైస్తవుల కోసం రూ. 2 లక్షలు, 1వెయ్యి గిప్టులు(దుస్తులు) మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాండూరు ఆర్డీఓ ఆధ్వర్యంలో పండగ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటిని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ సోదరులకు రేపు శనివారం క్రిస్మస్ కానుకలు పంపిణీతో పాటు విందు ఏర్పాటు చేసినట్లు తాండూరు ఆర్డీఓ శ్రీనివాస్ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

క్రిస్మస్ పండగ సందర్భంగా శనివారం తాండూరు పట్టణం అంతారం రోడ్డు మార్గంలోని వైట్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. తాండూరు నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులకు, మహిళలకు దుస్తుల పంపిణీ చేస్తారని, అనంతరం విందు ఉంటుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, క్రైస్తవ సోదరులు హజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి…

