అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదు
– ఎంతటివారికైనా చర్యలు తప్పవు
– తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అభివృద్ధి విషయంలో అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం గల్లి గల్లికి పైలెట్ కార్యక్రమంలో భాగంగా పాత తాండూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటి ఏడాది ఎన్నికలతో పూర్తి కాగా రెండవ ఏడాది కరోనా మహమ్మారి దెబ్బతీసిందన్నారు. తాండూరు అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నామని, వచ్చే రెండున్నర ఏళ్లలో తాండూరులో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించి చూపిస్తామని అన్నారు. అయితే కొందరు అభివృద్ధి విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని, అలాంటి వ్యక్తులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరు, ఎలాంటి పదవిలో ఉన్న చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలని అన్నారు.
