క్రీడాభివృద్ధికి తోడ్పాటు

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

క్రీడాభివృద్ధికి తోడ్పాటు
– క్రీడల్లో అందరిని ప్రోత్సహించాలి
– తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కేవీసీఎస్‌లో అట్టహాసంగా వార్షిక స్పోర్ట్ మీట్
తాండూరు, దర్శిని ప్రతినిధి :
విద్యతో పాటు క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో వార్షిక స్పోర్ట్స్ మీట్-2023 పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృఢత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. తల్లి దండ్రులు క్రీడాకారులను ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులు కూడా చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. తాండూరులో విద్య రంగాన్ని అభివృద్ధి పరచడమే కాకుండా క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు.

అదేవిధంగా కేవీసీఎస్ విద్యా ప్రమాణాలు భాగున్నాయని అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేలాల విద్యార్థులను తీర్చి దిద్దడం అభినందనీయమన్నారు. మరోవైపు స్పోర్ట్స్ మీట్ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, నాయకులు మసూద్, కేవీపీఎస్ యజమాన్య కమిటి సభ్యులు మల్లెపల్లి వెంకటేశం, ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్. విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం