మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!
– రెండు రోజుల్లోనే 2వ వార్డులో డ్రైనేజీ పనులు
– ప్రారంభించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారంలో వేగంగా స్పందిస్తూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చర్యలు చేపట్టారు.

మున్సిపల్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 2వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక కౌన్సిలర్ ప్రత్యుష మెహన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కౌన్సిలర్ ఎమ్మెల్యేకు వివరించగా, సమస్యను పరిష్కరిస్తామని బీఎంఆర్ హామీ ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండు రోజులకే డ్రైనేజీ పనులు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి, కౌన్సిలర్ ప్రత్యుష మెహన్ కలిసి వార్డు నంబర్–2లో డ్రైనేజీ పనులను ప్రారంభించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.


